ఏ తల్లి కన్న బిడ్డో గానీ.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా..

9 Dec, 2021 17:11 IST|Sakshi

గతంలో ఎవరైనా ఆపదలో ఉంటే ప్రజలు తక్షణమే స్పందించి ప్రమాదంలోని వారికి సాయం అందించేవాళ్లు. కానీ ప్రస్తుత సోషల్‌మీడియా సమాజంలో మాత్రం సాయం మాట అటుంచితే సెల్ఫీలు, వీడియోలు తీసి నెట్టింట షేర్‌​చేసే నెటిజన్లకు మాత్రం కొదవలేదని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇటీవల మనం చాలానే చూసాం. అయితే ఇంకా మానవత్వం మిగిలే ఉందని అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మనకి అనిపిస్తాయి. అసలు అంతలా ఆ వీడియోలో ఏముంది..

ఓ బాలుడు ‍ప్రమాదకరంగా భవనంపై నుంచి వేలాడుతూ కనిపిస్తాడు. దీంతో ఎక్కడి నుంచి వచ్చాడో గానీ ఒక్కడు మాత్రం అందరిలా చోద్యం చూస్తూ, వీడియోలు ఫోటోలు తీయడం చేస్తూ సమయాన్ని వృథా చేయలేదు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు కదిలాడు. ఆలోచన చేయలేదు, ఒక్కఉదుటున పెకెక్కి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఏ తల్లి కన్న బిడ్డవో గానీ నువ్వు చల్లగా ఉండాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు