నది మధ్యలో నరకయాతన

25 Jul, 2020 18:50 IST|Sakshi
పోలీసులు, ఈతగాళ్లతో జీవన్‌లాల్‌సింగ్‌ (ఎర్ర బనియన్‌)

గోదావరిలో చిక్కుకున్న యువకుడు

100కు డయల్‌  చేయడంతో వచ్చి కాపాడిన పోలీసులు

సాక్షి, కాళేశ్వరం: గోదావరి దాటుతున్న ఓ యువకుడు వరదలో చిక్కుకున్నాడు. ఏడు గంటల పాటు నది మధ్యలోనే ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సమీపంలోని కుంట్లం–3 ఇసుక క్వారీ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొల్లూరు ఇసుక క్వారీలో పనిచేసే జీవన్‌లాల్‌ సింగ్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అన్నారంలోని క్వారీ వద్దకు వచ్చాడు.

తిరుగు ప్రయాణంలో కుంట్లం–3 క్వారీ నుంచి కొల్లూరుకు కాలినడకన గోదావరి మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో మధ్యలో చిక్కుకున్నాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు వరదలో చిక్కుకున్న జీవన్‌లాల్‌.. అరుపులు, కేకలు వేసినా ఎవరికీ వినపడలేదు. చివరికి మధ్యాహ్నం అతని అరుపులు విన్న క్వారీ సిబ్బంది 100కు డయల్‌ చేశారు. కానిస్టేబుళ్లు సంజీవ్, మధుకర్‌ అక్కడికి చేరుకుని ఓ నాటు పడవలో ఇద్దరు గజ ఈతగాళ్లతో వెళ్లి జీవన్‌లాల్‌ సింగ్‌ను తీసుకువచ్చారు. (ప్ర‌భుత్వం ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకోవాలి)

మరిన్ని వార్తలు