చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

25 Feb, 2022 05:56 IST|Sakshi

జియాగూడ: అభం శుభం తెలియని చిన్నారికి మాయమాటలు చెప్పి వరుసకు బంధువు అయిన వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన కులుస్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.  బస్తీవాసులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గురువారం కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్, ఎస్‌.ఐ.సత్యనారాయణ తెలిపిన మేరకు..

రాజస్థాన్‌కు చెందిన దంపతులు కుల్సుంపురా ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈ నెల 17న తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ఏడేళ్ల పెద్ద కూతురు ఇంటివద్దే ఆడుకుంటోంది. చిన్నారిని అదే ప్రాంతంలో నివాసముంటున్న జితేందర్‌ చావ్లా సైకిల్‌ నేర్పిస్తానని మాయమాటలు చెప్పిపై అంతస్తులోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. అయితే సోనుచావ్లా సోదరుడు సన్నీచావ్లా  అక్కడే ఉండటంతో గమనించి నిలదీయడంతో నిందితుడు పరారయ్యాడు.

ఇదిలా ఉండగా పెద్దలు జాతీయ రహదారి పీలిమండప్‌ గుడివద్ద పంచాయితీ చేసి సదరు నిందితుడికి ఏడాదిపాటు కుల బహిష్కరణ చేశారు. అయితే గురువారం బాలిక తల్లిదండ్రులు స్థానికులతో కలిసి నిందితుడికి దేహశుద్ధి చేస్తూ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు