చెత్తలో ఉంటూ.. చెత్త తింటూ.. 

6 Sep, 2020 09:24 IST|Sakshi
వీడియో దృశ్యం

సాక్షి, సంగారెడ్డి : నా అనే వారు  లేరు.  ఎక్కడ పుట్టాడో..  ఎక్కడ పెరిగాడో..  ఏమి తింటున్నాడో తెలియదు.  చెత్త కుప్పలో ఉంటూ.. చెత్త తింటూ బతుకు వెల్లదీస్తున్నాడో వ్యక్తి. మూగ జీవలు ఇబ్బంది పెడుతున్నా.. భరించలేనంత కంపు కొడుతున్నా చెత్త కుప్పను వదలడం లేదు. సంగారెడ్డి జిల్లా  కేంద్రం బస్ స్టాండ్ వద్ద వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. చుట్టూ చెత్త వేస్తున్న జనం ఆ వ్యక్తి ఎవరని చూడకుండా తమ పనిచేసుకుపోతున్నారు. కరోనా వైరస్‌ భయంతో జనం అతడి గురించి పెద్దగా ఆలోచించటం లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి : బతికి ఉండగానే చనిపోయినట్లు డాక్టర్‌ ధ్రువీకరణ

మరిన్ని వార్తలు