మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని ట్వీట్‌

20 Jun, 2022 07:27 IST|Sakshi

బంజారాహిల్స్‌: ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేకపోతున్నానని, తన కారుణ్య మరణానికి (మెర్సీ కిల్లింగ్‌) అనుమతినివ్వాలంటూ ఒకరు తెలంగాణ సీఎంఓ, మంత్రి కేటీఆర్, డీజీపీ, నగర పోలీసు కమిషనర్, బంజారాహిల్స్‌ పోలీసులకు ట్వీట్‌ చేశారు. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌ ప్రాంతానికి చెందిన జితేంద్ర శ్రీరాంగిరి (43) ప్రమాదం బారిన పడి మెరుగైన వైద్యం కోసం గతేడాది నవంబరులో నగరానికి వచ్చాడు.

కాలికి ఆరు ఆపరేషన్లు నిర్వహించిన అనంతరం ఇక్కడున్న బ్రిన్నోవా రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చేరారు. నెలకు లక్ష రూపాయల ఖర్చుతో ఒంటరిగా చేరిన ఆయన స్నేహితుల ద్వారా తన వైద్య ఖర్చులకు అవసరమైన డబ్బులను సేకరించి చెల్లిస్తున్నారు. కాగా జనవరి నాటికి రూ.2.8 లక్షలు చెల్లించిన అతను మిగిలిన డబ్బులు చెల్లించలేకపోయారు. డబ్బుల కోసం ఆసుపత్రి సిబ్బంది ఒత్తిడి తేవడంతోపాటు తనకు ఆహారం అందించడం లేదని, టీవీ కట్‌ చేశారంటూ ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో తనకు మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలంటూ ఆయన వారందరికీ ట్వీట్‌ ద్వారా వేడుకున్నారు. 

(చదవండి: 'బ్లాక్‌ గ్రూప్‌’ అగ్గి పెట్టింది!)

మరిన్ని వార్తలు