బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసుల నోటీసులు

11 Feb, 2024 13:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేసి.. విచారణకు రావాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో సుమన్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బాల్క సుమన్‌ అనుచిత వ్యాఖ్యల చేసిన విషయం తెలిసిందే. అదే రోజు బాల్క సుమన్‌పై కాంగెస్‌ పార్టీ మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నేడు పోలీసులు బాల్క సుమన్‌ నోటీసులు జారీ చేశారు. 

తనకు వచ్చిన పోలీసు నోటీసులపై బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ స్పందించారు. కాంగ్రెస్‌ సర్కార్‌ తనపై అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొన్న పార్టీ బీఆర్‌ఎస్‌ అని అన్నారు.

చదవండి: సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega