రాజ్యాంగ ద్రోహి కేసీఆర్‌

13 Feb, 2022 03:05 IST|Sakshi
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న జాజుల, మందకృష్ణ, ప్రొఫెసర్‌ హరగోపాల్, బండి సంజయ్‌ 

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మందకృష్ణ మాదిగ ధ్వజం

రాజ్యాంగాన్ని మార్చాలంటే మరో అంబేడ్కర్‌ పుట్టాలి: వైఎస్‌ షర్మిల

కేసీఆర్‌ ‘రాజ్యాంగ మార్పు’ వ్యాఖ్యలపై వక్తల నిరసన  

ఖైరతాబాద్‌: దేశ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ తన మాటల ద్వారా రాజ్యాంగ ద్రోహిగా మారారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ మాదిగ స్టూడెంట్‌ ఫోరం, ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్, ఎంఎస్‌పీల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది.

మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రొఫెసర్‌ హరగోపాల్, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ఇందిరాశోభన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేయలేని కేసీఆర్‌... రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లే ముఖ్యమంత్రి కాగలిగిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాకపోయుంటే ఆయనకు సీఎం అయ్యే అవకాశమే ఉండేది కాదన్నారు. అంబేడ్కర్‌పట్ల కృతజ్ఞత లేని వ్యక్తి కేసీఆర్‌ అని విమర్శించారు.

ఉద్యమ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర: బండి సంజయ్‌
తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేయాలని కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం కావాలో లేక అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాల న్నారు. కల్వకుంట్ల రాజ్యాన్ని అంతం చేసి రాజ్యాంగానికి లోబడి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు.

కేసీఆర్‌ది అహంకారం: వైఎస్‌ షర్మిల
అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మార్చా లనుకోవడం కేసీఆర్‌ అవిధేయతే కాదు.. అహంకారం కూడా అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌. షర్మిల విమర్శించారు. కేసీఆర్‌కు రా జ్యాంగంపట్ల, దాన్ని రాసిన అంబేడ్క ర్‌పట్ల గౌరవం ఉందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబే డ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తానంటూ గతంలో ప్రకటించిన కేసీఆర్‌ ఇప్పటివర కు ఆ విషయాన్ని పట్టించు కోలేదని మం డిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే మరో అంబేడ్కర్‌ పుట్టాలన్నారు.

మరిన్ని వార్తలు