కోమటిరెడ్డికి కొత్త ఇన్‌ఛార్జి ఫోన్‌ కాల్‌.. గాంధీభవన్‌కు రానంటే రానంటూ బదులు..!

11 Jan, 2023 10:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే రాక సందర్భంలోనూ.. పార్టీలో  నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విభేదాలను పక్కనపెట్టి.. అంతా ఆయనకు కలిసే స్వాగతం పలుకుతారేమోనని భావించారంతా. కానీ, అక్కడా టీపీసీసీ చీఫ్‌ డామినేషన్‌ కనిపించింది. 

బుధవారం ఎయిర్‌పోర్ట్‌లో రేవంత్‌రెడ్డి అండ్‌ కో.. మాణిక్‌రావ్‌ ఠాక్రేకు స్వాగతం పలికింది. మరోవైపు సీనియర్‌ వీహెచ్‌ స్వాగతం పలికేందుకు అక్కడకు వెళ్లగా.. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ఆయన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లు మినహా రేవంత్‌ నాయకత్వంపై అసంతృప్త గళం వినిపిస్తున్న వాళ్లెవరూ అక్కడ కనిపించలేదు.​ ఇదిలా ఉంటే.. గాంధీ భవన్‌కు చేరుకున్న ఠాక్రే.. ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీలతో భేటీ అయ్యారు. అయితే.. గాంధీ భవన్‌కు రావాల్సిందిగా  ఠాక్రే స్వయంగా ఫోన్‌ చేసినా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. చాలాకాలంగా పార్టీ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో రలిగిపోతున్నారు. ముఖ్యంగా రేవంత్‌ నాయకత్వాన్ని ఆయన బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రానికి కొత్త ఇన్‌ఛార్జిగా వచ్చిన మాణిక్‌రావ్‌ ఠాక్రే ఆయనకు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే గాంధీ భవన్‌ మీటింగ్‌ తాను రానని స్పష్టం చేసిన కోమటిరెడ్డి.. కావాలంటే బయటే కలుస్తానని ఠాక్రేకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి కోమటిరెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది.

ఇక గాంధీ భవన్ చేరుకున్న టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మానిక్ రావ్ థాక్రే.. ఏఐసీసీ సెక్రటరీ లు  బోస్ రాజు , నదీమ్ జావెద్ ,రోహిత్ చౌదురి తో భేటీ అయిన థాక్రే.. రాష్ట్రంలో పార్టీ పని తీరు, నాయకుల మధ్య విభేధాల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకోనున్నారు. ఆపై ఆయన అందరితో కలిసే భేటీ నిర్వహించాలని యోచినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మరిన్ని వార్తలు