అంతర్జాతీయ స్థాయిలో లింక్స్ ఉంటాయి

12 Sep, 2020 19:22 IST|Sakshi
మాజీ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్

సాక్షితో మాజీ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్

సాక్షి, హైదరాబాద్‌ : సినీ రంగమంతా డ్రగ్స్‌మత్తకు బానిసగా మారిపోయిందని మాజీ ఎక్సైజ్ కమీషనర్ చంద్రవదన్ అన్నారు. బాలీవుడ్, టాలీవుడ్‌లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ లింక్స్ ఉంటాయని అన్నారు. డ్రగ్స్ వాడకం, సరఫరాకు ఏమాత్రం పరిధులు లేవున్నారు. తన దర్యాప్తులో భాగంగా డ్రక్స్‌కు బానిసలుగా మారిన ఎంతోమంది నటులను చూశామని తెలిపారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలను డ్రక్స్‌ కేసు ఊపేస్తున్న తరుణంలో చంద్రవదన్ సాక్షి మీడియాతో మాట్లాడారు. చాలామంది నటులు గ్లామర్ కాపాడుకోవాలంటే డ్రగ్స్ వాడక తప్పదని తమతో చెప్పారని వెల్లడించారు. సమాజంపై డ్రగ్స్‌ ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభత్వం ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. (డ్రగ్స్‌ : షూటింగ్‌ నుంచి వెళ్లిపోయిన రకుల్‌)

శనివారం సాక్షి మీడియాతో చంద్రవదన్‌ మాట్లాడుతూ.. ‘గతంలో మా దృష్టకి అనేక  డ్రగ్స్‌ కేసులు వచ్చాయి. కానీ ఆ దర్యాప్తులో ఏం తేలిందో నేను ఇప్పుడు చెప్పలేను. మా విచారణ ఎదుర్కొన్న వాళ్లంతా, నేను ఒక్కడినే కాదు చాలా మంది ఉన్నారని చెప్పారు. మేమూ ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటాము. రియా కేసులో ప్రముఖ నటి పేరు వింటున్నాం అది కాస్తా టాలీవుడ్‌కు రాదని మాత్రం చెప్పలేను. ఎన్‌సీబీ దర్యాప్తు చాలా లోతుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం ఉంది. డ్రగ్స్ వాడే వారిని మేము గతంలో బాధితులుగా చూశాము.  అమ్మే వారి సమాచారం అంతా సేకరించాము. (డ్రగ్స్‌ కేసులో రకుల్‌, సారా పేర్లు?)

ఎక్సైజ్‌ శాఖ దర్యాప్తు తర్వాత హైద్రాబాద్ లో డ్రగ్స్ మూలాలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఈ డ్రగ్స్ మూలాలు మళ్లీ, మళ్లీ బయట పడుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్‌లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో లింక్స్ ఉంటాయి. చాలా మంది ప్రముఖులు డ్రగ్స్ వాడున్నారు. ఎన్‌సీబీ చట్టం ప్రకారం.. డ్రగ్స్ వినియోగ దారులు సైతం శిక్షార్హులే. ఇది అశామాశి వ్యవహారం కాదు. సమాజంలో అందరిపై ప్రభావం చూపుతుంది. కేంద్రం చొరవ చూపి  కఠినంగా వ్యవహరించి మూలాలను బ్రేక్ చెయ్యాలి’ అని పేర్కొన్నారు. 


 

మరిన్ని వార్తలు