జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భారీ వర్షం

19 Sep, 2020 09:23 IST|Sakshi

సాక్షి, గ‌ద్వాల :  గత వారం రోజులుగా భారీ వర్షం  కురుస్తుండ‌టంతో పట్టణం తడిసి ముద్దయింది. భారీ వర్షంతో గద్వాల   పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. గతంలో ఎన్నడు లేని విధంగా  ముఖ్యంగా గంజి పేట, కుంట వీధి , రాజీవ్ మార్గ్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ గుండా భారీ వర్షపునీరు నిల్వ ఉంది. దీంతో కాలనీలోని ప్రజలతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనంటున్నారు. భారీ వర్షం వల్ల కాలనీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధులను, ప్రధాన కూడళ్లను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్‌తో క‌లిసి  పరిశీలించారు.

మున్సిపల్ సిబ్బందితో డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పరచడంతో పాటు మురుగునీరు నిల్వ ఉండకుండా చూసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పునరావాసం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చెరువులు వాగులు, వంకలు నిండుకుండలా ఉన్న దృష్టి ఆ వైపు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల గద్వాలలో 82.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు