పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత

14 Jul, 2021 12:47 IST|Sakshi
రావుల రంజిత్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది.మావో అగ్రనేత, దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న అలియాస్‌ రావుల శ్రీనివాస్‌ కుమారుడు రావుల రంజిత్ బుధవారం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి  సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం రంజిత్‌ దండకారణ్యం బెటాలియన్‌ కమిటీ చీఫ్‌గా కొనసాగుతున్నాడు. కాగా రెండు సంవత్సరాల క్రితం తండ్రి రామన్న ఆనారోగ్య  సమస్యతో రామన్న చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రంజిత్‌ స్వస్థలం సిద్దిపేట జిల్లా ముగ్దుర్ మండలం బెక్కల్ గ్రామం.ఈ సందర్భంగా రావుల రంజిత్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడారు.

'' మావోయిస్టు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ ప్రస్తుతం ప్లాటున్ కమిటి మెంబర్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా కు చెందిన మావోయిస్టు నేత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న కుమారుడు రంజిత్ 1998లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో  చురుగ్గా వ్యవహరించాడు. తండ్రి రామన్న ఆధ్వర్యంలో రంజిత్ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2017లో రామన్న సలహా మేరకు సెకండ్ బెటాలియన్ లో రంజిత్ జాయిన్‌ అయి 2019 వరకు మెంబర్‌గా వ్యవహరించాడు. అయితే  తండ్రి మరణం తర్వాత రంజిత్ అనేక అవమానాలకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో పార్టీ మాత్రం అతని లొంగుబాటుకు అంగీకరించలేదు. ఈ మధ్యన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తనంతట తాను లొంగిపోవాలని రంజిత్‌ భావించాడు. 2017 నుండి 2019 ఆమ్స్ బెటాలియన్ లో పని చేసాడు.2018  కాసారం అటాక్ లో కీలక పాత్ర పోషించాడు..2021 లో జీరం అటాక్‌తో పాట 2020 మినప అటాక్లో సైతం రంజిత్‌ చురుగ్గా వ్యవహరించాడు.

కరోనా పాండమిక్ సమయంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ లో మొత్తం 25 మంది మావోయిస్టులు ఉన్నారు. తెలంగాణ రాష్టం నుంచి 11 మంది, ఆంద్రప్రదేశ్ నుంచి 3 మంది సెంట్రల్ కమి ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల లో ఉన్న 14 మంది మావోయిస్టులు లొంగిపోవాలి. 4 లక్షల పరిహారం తో పాటు ప్రస్తుత ఖర్చులకు  5 వేలు అందజేస్తున్నాం.'' అంటూ తెలిపారు.

మరిన్ని వార్తలు