సొంత కమాండర్‌నే హతమార్చిన మావోలు

3 Oct, 2020 08:29 IST|Sakshi

చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు సొంత దళకమాండర్‌నే హతమార్చిన సంఘటన గురువారం జరిగింది. బస్తర్‌ రేంజ్‌ ఐజీ ఈ ఘటనను ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. బీజాపూర్‌ జిల్లా గంగులూరు ఏరియాలో పలువురు ఆదివాసీలను మావోయిస్టులు హత్య చేశారు. అయితే ఈ హత్యల నేపథ్యంలో పలువురు అమాయక ఆదివాసీలు సైతం హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో గంగులూరు డీవీసీ ఏరియా కమిటీ కమాండర్‌ విజా మొడియం అలియాస్‌ భద్రు (34) కొంతకాలంగా వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వారిని హత్య చేశారనే సమాచారం మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలకు చేరింది. దీంతో గురు వారం గంగులూరు–కిరండోల్‌ మధ్యలోని ఎటావర్‌ అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టు ముఖ్య నేతలు సదరు కమాండర్‌ను హతమార్చినట్లు తెలుస్తోంది. (బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఏజెన్సీ)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు