తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా బదిలీలు

12 Feb, 2024 17:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్‌ డీఆర్డీవో, డీపీవోలకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది.

మరోవైపు, తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలిసింది. మల్టీజోన్-1లో 84, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెవెన్యూ శాఖలో ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega