శాంతించవమ్మా.. గంగమ్మా

21 Oct, 2020 13:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరిస్తోంది. ఉత్తర ఈశాన్యంగా పయనిస్తూ బలపడి వాయుగుండంగా మారనుంది. ఒడిశా-బెంగాల్ తీరంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం తెలిపింది. దాని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  

మూసీకి పూజలు:
పురానాపూల్ వద్ద మూసీకి హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్  బుధవారం శాంతి పూజలు చేశారు. ఈ కార్యక్రమం‍లో గంగమ్మ తల్లికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. శాంతి పూజలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. అనంతరం దర్గాలో మేయర్‌, మంత్రులు చాదర్ సమర్పించనున్నారు.

లాలాపేటలో మంత్రి కేటీఆర్
భాగ్యనగరంలో గత కొన్ని రోజలుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి, లోతట్టు పాంత్రాలో ఉన్న కాలనీలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ లాలాపేటలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆయన బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు.

>
మరిన్ని వార్తలు