18 తేదీవరకు గడువు పొడిగించిన విద్యాసంస్థ

15 Sep, 2020 15:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహేంద్ర యూనివర్శిటీ ఎకోలే సెంట్రలే స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్ (ఎంఈసీ)‌,హైదరాబాద్‌ నాలుగు సంవత్సరాల బీటెక్‌ కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంఈసీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో 2020-2024 విద్యాసంవత్సరానికి  కోర్సులో చేరాలనుకునే ఆసక్తి ఉన్న వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 18వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగుస్తుందని ఎంఈసీ ప్రకటించింది. www.mechyd.ac ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. అన్‌లైన్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించి, విద్యార్థులకు వారు ఎంపికయిన బ్రాంచ్‌ల వివరాలు తెలియజేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎంఈసీ విద్యాసంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. 

ఎంఈసీలో బీటెక్‌కు సంబంధించి 400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 7 బ్రాంచ్‌లు- కంప్యూటర్‌ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటేషన్‌ అండ్‌ మ్యాధమేటిక్స్‌ బ్రాంచ్‌లు కలవు. జేఈఈ మెయిన్స్ ర్యాంక్‌, శాట్‌ స్కోర్‌ ఆధారంగా లేదా ఏసీటీ స్కోర్‌, 10+2 పరీక్షల ఆధారంగా అడ్మిషన్లను పొందవచ్చు అని ఎంఈసీ నిర్వాహకులు తెలిపారు. 

చదవండి: మెకానిక్‌ కొడుకు.. అమెరికన్‌ స్కూల్‌ టాపర్‌

మరిన్ని వార్తలు