మద్యం మత్తులో విద్యుత్‌ స్తంభం ఎక్కి.. 

25 Feb, 2023 01:05 IST|Sakshi
సాయిరాం 

విద్యుదాఘాతంతో యువకుడికి తీవ్రగాయాలు 

ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి 

పోలీసుల వాహన తనిఖీ నేపథ్యంలో హల్‌చల్‌  

వెల్దుర్తి (తూప్రాన్‌): మద్యం మత్తులో ఓ యువకుడు విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. వివిద్యుదాఘాతంతో తీవ్రగాయాలై కిందపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేట మండలం శంకరాజ్‌ కొండాపూర్‌ గ్రామానికి చెందిన యాట సాయి­రాం (24) శుక్రవారం సాయంత్రం వెల్దుర్తి నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఉప్పులింగాపూర్‌ గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలతోపాటు డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేస్తున్నారు.

ఆ సమయంలో అక్కడకు చేరుకున్న సాయిరాం మద్యం మత్తులో హల్‌చల్‌ చేస్తూ పక్కనే ఉన్న ­విద్యు­త్‌ స్తంభం ఎక్కాడు. గమనించిన పోలీç­Üులు కిందకు దించి అక్కడి నుంచి పంపించారు. అనంతరం యథావిధిగా తనిఖీలు చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత సాయిరాం మళ్లీ తిరిగొచ్చి పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభంపైకి ఎక్కి తీగలు పట్టుకోవడతో విద్యుదాఘాతంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని తూప్రాన్‌ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. 

మరిన్ని వార్తలు