వ్యాక్సిన్ : వరంగల్‌లో‌ హెల్త్‌ వర్కర్‌ మృతి!

24 Jan, 2021 17:43 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లోనే 10 లక్షల మంది హెల్త్‌ వర్కర్స్‌, ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారు. రానున్న రోజుల్లో పోలీసులు, ప్రజాప్రతినిధులకు వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్‌ కోరల్లో నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని వైద్యులతో పాటు ప్రభుత్వాలు సైతం చెబుతున్నాయి. ఈ క్రమంలో కరోనా టీకా తీసుకున్న కొందరు అస్వస్థతకు గురవుతుండగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. టీకా తీసుకున్న అనంతరం ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఒక్కరు చొప్పున  మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. చదవండి: వికటించిన వ్యాక్సిన్‌.. ఆశ కార్యకర్త బ్రెయిన్‌ డెడ్‌! 

గుండెపోటుతో నిర్మల్‌లో విఠల్‌రావు చనిపోగా, గుంటూరులో ఆశ కార్యకర్త విజయలక్ష్మి బ్రెయిన్‌ డెడ్ అయింది. అయితే వీరి మరణాలకు కోవిడ్‌ టీకానే కారణమా అని ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తీసుకున అనంతరం మరో మహిళ మృతి చెందడం కలకలం రేపుతోంది. వరంగల్‌ అర్బన్‌ శాయంపేట అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న హెల్త్‌ వర్కర్‌ వనిత.. ఈ నెల 22న వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆమె మరణించారు. అయితే వ్యాక్సిన్‌ వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె వ్యాక్సిన్‌ రియాక్షన్‌ కారణంగానే మరణించిందని వైద్యులు నిర్థారించలేదు. చదవండి: ఒకవేళ విద్యార్థులకు కరోనా సోకితే..

ఘటనపై నివేదిక కోరిన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌
వరంగల్ అర్బన్ జిల్లాలో హెల్త్‌ కేర్ వర్కర్‌ మృతిపై జిల్లా అధికారులను తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్ శ్రీనివాసరావు నివేదిక కోరారు. హెల్త్‌ కేర్‌ వర్కర్‌ మరణంపై ఏఈఎఫ్‌ఐ నివేదికను సిద్ధం చేస్తోంది. కేంద్ర ఏఈఎఫ్‌ఐ బృందంతో చర్చించాకే తుది నివేదిక ఇవ్వనున్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు