Preethi: మెడికో ప్రీతి కేసు.. అనుమానాస్పద మృతిగా మార్చే ఛాన్స్..!

5 Mar, 2023 23:04 IST|Sakshi

మెడికో ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.  ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో ఎలాంటి  విషపదార్థాలు  డిటెక్ట్ కాలేదని రిపోర్ట్‌లో వెల్లడైంది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్  స్పష్టం చేసింది.  గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్ట్‌లో తేలింది. 

ఇప్పటికే ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్  వరంగల్ సీపీ రంగనాథ్ సీపీ చేతికి చేరింది. దీంతో ఆత్మహత్యాయత్నం కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నారు. ప్రీతిది  హత్యా, ఆత్మహత్యా తేల్చుకోలేక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని ఆమె కుటుంబసభ్యులు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

హైదరాబాద్‌కు వరంగల్ సీపీ

ప్రీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు.  ఇప్పటికే డీజీపీ వరంగల్ సీపీ రంగనాథ్‌కు ఫోన్ కూడా చేశారు.  

ప్రీతి కేసు కొత్త మలుపు

మెడికల్ విద్యార్థిని ప్రీతీ ఉదంతం కొత్త మలుపు తిరగబోతోంది. సైఫ్ హోమ్ మంత్రికి సమీప బంధువు అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసు మరిన్నీ మలుపులు తిరగనుంది. తాజా నివేదికతో ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతి గా కేసు మార్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు