మెహదీపట్నం ప్రీమియర్ ఆస్పత్రిలో దారుణం.. చికిత్స పేరుతో రూ.16లక్షలు వసూలు.. అయినా పేషెంట్‌ మృతి

3 Oct, 2022 12:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెహదీపట్నం ప్రీమియర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చికిత్స కోసం వచ్చిన ఓ రోగి వద్ద రూ.16 లక్షలు వసూలు చేసి ఆస్పత్రి వైద్యులు అతనికి మృతికి కారణమయ్యారని బంధువులు ఆరోపించారు. సబ్జి మండికి చెందిన  జై కిషన్ గంగపుత్ర (54)  గుండెనొప్పితో 15 రోజులు క్రితం ఆసుపత్రికి  రాగా.. ట్రీట్‌మెంట్‌ పేరుతో భారీగా డబ్బులు దండుకున్నారు. అయినా సరైన వైద్యం అందించక పోవడంతో అతను చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

జై కిషన్‌ భార్య రాజ్యలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అతని ఆకస్మిక మరణంతో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తక్షణమే ప్రభుత్వం, మంత్రులు , పోలీసులు స్పందించి ప్రీమియర్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
చదవండి: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే!

మరిన్ని వార్తలు