హైదరాబాద్‌: నేడు ట్రాఫిక్‌ మళ్లింపులు

30 Oct, 2020 09:25 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

సాక్షి, హైదరాబాద్‌: మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పాతబస్తీ సహా కొన్ని చోట్ల ట్రాఫిక్‌ మళ్లిస్తారు. చార్మినార్, శాలిబండ, మోతిగల్లీ, మదీన, డబీర్‌పుర, అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్, చెత్తబజార్‌ ప్రాంతాల్లో ఇవి ఉండనున్నాయి.  

నేడు రక్తదాన శిబిరం
మహ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా అవసరం ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటం పుణ్యకార్యమని మౌలానా హఫేజ్‌ అహెసన్‌ అల్‌ హుముమీ చేప్పారు. మిలాదున్నబిని పురస్కారించుకొని ఈ నెల30న రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్ల నుంచి సంస్థ తరుపున ప్రతిఏటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 


మిలాద్‌ ఉన్‌ నబీ సందడి
మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకుని గురువారం రాత్రి నగరంలోని పలు ప్రధాన ప్రాంతాలను ఆకుపచ్చ తోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చౌరస్తాల్లో రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిచారు. నెలవంక పచ్చ జెండాల విక్రయాలు ఊపందుకున్నాయి. పాతబస్తీతో పాటు ముస్లింలు అధికసంఖ్యలో నివసించే ప్రాంతాలు కళకళలాడుతున్నాయి.
   

మరిన్ని వార్తలు