ఈటల కుటుంబాన్ని పరామర్శించిన అమిత్‌ షా

18 Sep, 2022 01:31 IST|Sakshi
ఈటల ను పరామర్శిస్తున్న కేంద్రహోంమంత్రి అమిత్‌ షా 

మేడ్చల్‌ రూరల్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా శనివారం మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేం­దర్‌ నివాసానికి వెళ్లా­రు. ఈటల రాజేందర్‌ తండ్రి మల్లయ్య ఇటీవల మరణించడంతో అమిత్‌ షా వారి కుటుంబాన్ని పరామర్శించారు. మేడ్చల్‌ జిల్లా పూడూర్‌ గ్రామ పరిధిలో ఓఆర్‌ఆర్‌ పక్కన ఉన్న ఈటల రాజేందర్‌ నివాసానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్న అమిత్‌ షా.. ఈటల మల్లయ్య చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.

అనంతరం రాజేందర్‌తో భేటీ అయిన అమిత్‌ షా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలసి రాష్ట్ర రాజకీయాలపై 20 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌.. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారెవ్వరూ కేసీఆర్‌తో లేరని, చాలా మంది నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అమిత్‌ షాకు వివరించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు