టీఆర్‌ఎస్‌కు ఓటేసి రుణం తీర్చుకోవాలి: మంత్రి గంగుల

25 Jul, 2021 07:27 IST|Sakshi

సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌): నియోజకర్గానికి సీఎం కేసీఆర్‌ అడగకుండానే వరాలు ఇస్తున్నారని, టీఆర్‌ఎస్‌కు ఓటేసి రుణం తీర్చుకోవాలని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం పట్టణంలోని సీటీసెంట్రల్‌ ఫంక్షన్‌హాల్‌లో పట్టణానికి చెందిన మెకానిక్‌లతో సమావేశమయ్యారు.  ఆయన మాట్లాడుతూ.. ఆటోనగర్‌ను ఏర్పాటు చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యేను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు.

హుజూరాబాద్‌లో ఆటోనగర్‌ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రిని అడిగితే వెంటనే మూడెకరాల భూమిని కేటాయించారన్నారు. గతంలోని చెరువులు ఎండేవని, ఇప్పుడు కాళేశ్వరంతో మత్తళ్లు దూకుతున్నాయని తెలిపారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని అశీర్వదించాలని కోరారు. అనంతరం ఆటో యూనియన్‌ సభ్యులకు భూమిపత్రాలను అందజేశారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌ పర్సన్‌ కొలిపాక నిర్మల, కరీంనగర్‌ మేయర్‌ వై.సునీల్‌రావు, యూనియన్‌ నాయకులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు