శభాష్‌ గాడ్గే మీనాక్షి.. ముఖరా(కె) పచ్చదనం భేష్‌..

1 Aug, 2021 08:42 IST|Sakshi

మొక్కల పెంపకంపై అభినందించిన కేంద్ర మంత్రి  

ఇచ్చోడ: ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దిన తీరు అభినందనీయమని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ శనివారం ట్వీట్‌ చేశారు. ఇందుకు కృషి చేసిన సర్పంచ్‌ గాడ్గే మీనాక్షిని అభినందించారు. అడవులు అంతరించిపోతున్న ఈ సమయంలో హరితహారం ద్వారా ఒకటిన్నర ఎకరంలో ఒకేచోట పెద్ద మొత్తంలో మొక్కలు నాటి సంరక్షించడం బాగుందన్నారు. గ్రామాల్లో మొక్కలునాటి పచ్చదనాన్ని పెంపొందించడానికి దేశంలో ఇతర పంచాయతీలకు ముఖరా(కె) ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు