సరదా.. సరదాగా 

15 Oct, 2021 02:37 IST|Sakshi

సతీమణితో కలసి మంత్రి హరీశ్‌రావు బోటింగ్‌ 

సిద్దిపేటజోన్‌: సద్దుల బతుకమ్మ సందర్భంగా గురువారం రాత్రి కోమటిచెరువుౖ వద్ద రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు తన కుటుంబ సభ్యులతో సందడి చేశారు. కోమటిచెరువులో సతీమణి శ్రీనిత, కూతురు వైష్ణవి, మున్సిపల్‌ చైర్మన్‌ మంజుల, మహిళా ప్రజాప్రతినిధులు కవిత, వినితతో పాటు పలువురితో బోటింగ్‌ చేశారు.

తానే స్వయంగా బోట్‌ నడుపుతూ చెరువు చుట్టూ ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నెక్లెస్‌ రోడ్డు, నీటిపై తేలియాడే వంతెన, గ్లో గార్డెన్, నైట్‌పార్క్‌లో మంత్రి హరీశ్‌రావు కలియతిరిగారు. ఈ సందర్భంగా ప్రజలను పలకరించి వారితో సెల్ఫీలు దిగారు. ఆయన వెంట కడవేర్గ్‌ రాజనర్స్, మచ్చ వేణు, కొండం సంపత్‌ తదితరులు ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు