కేసీఆర్ రెవెన్యూ శాఖ‌ను ప్ర‌క్షాళ‌న చేశారు

24 Sep, 2020 21:04 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట : భారీ వ‌ర్షాల‌కు ఇళ్లు నేల‌మ‌ట్ట‌మై ఆశ్ర‌యం లేని 500కు పైగా కుటుంబాల‌కు మంత్రి హ‌రీష్‌రావు ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు పంపిణీ చేశారు. సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్‌లో వ‌ర్షాల కార‌ణంగా ఇళ్లు నేల‌కొరిగాయి. దీంతో ఒక్కొక్క కుటుంబానికి రూ.3200 చొప్పున్న చెక్కుల‌ను అంద‌జేశారు. అంతేకాకుండా 220 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌కి సంబంధించిన 2 కోట్ల 19 లక్షల 50 వేల రూపాయల చెక్కును మంత్రి హ‌రీష్  పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖలో ఇబ్బందులు ఉండకూడదని రెవెన్యూ ప్రక్షాళన చేయించార‌ని తెలిపారు.  ప్రతి ఒక్క రైతుకు 5 వేల రూపాయల రైతుబంధు ఇస్తున్నామని, పేర్కొన్నారు. (గ్రేటర్‌లో ఆర్టీసీ బస్సులను నడపండి)

 'పేదింటి ఆడ పిల్లల పెళ్లిలకు లక్షా 116 వేల రూపాయల సాయాన్ని అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తప్పా దేశంలో ఏ రాష్ట్ర సీఎం ఇవ్వడం లేదు, బీజేపి, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా ఇవ్వడం లేదు. ఈ ఏడాది వానాకాలం వానాలు అధికంగా పడ్డాయి. వారం రోజుల్లోపు నియోజకవర్గంలో ఏదైనా గ్రామం ముందుకొస్తే సీడ్ విలేజ్ గా మార్చేందుకు కృషి చేస్తా. విత్తనోత్పత్తి కేంద్రంగా  సిద్ధిపేట జిల్లాను మార్చుకుందాం.  విత్తనోత్పత్తి వల్ల అధిక లాభాలున్నాయి.  వారంలోపు విత్తనోత్పత్తి కోసం రైతులు ముందుకు వస్తే మీకు తోడ్పాటు అందిస్తా.జిల్లాలో పామాయిల్ ఉత్పత్తికి అనుకూలమని ఢీల్లీ నుంచి ఆమోదం వచ్చింది..జిల్లాలో 48 వేల ఎకరాలకు  ఫామ్ ఆయిల్ తోటలకు అనుమతి వచ్చిందని' మంత్రి హ‌రీష్ వెల్ల‌డించారు. (తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా