త్వరలోనే టీచర్ల బదిలీలు 

14 Jan, 2023 01:15 IST|Sakshi
పీఆర్‌టీయూటీఎస్‌ డైరీని ఆవిష్కరిస్తున్న మంత్రి హరీశ్‌రావు 

పీఆర్‌టీయూటీఎస్‌ డైరీ ఆవిష్కరణలో మంత్రి హరీశ్‌రావు   

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు యాజమా న్యాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి పదోన్నతులు, బదిలీ షెడ్యూల్‌ త్వరలోనే విడుదల కానున్నట్టు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. శుక్రవారం ఆయన పీఆర్‌టీయూటీఎస్‌ 2023 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు.

టీచర్ల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను సంక్రాంతి కానుకగా అందించాలని తాను సీఎం కేసీఆర్‌ను కోరగా, సానుకూలంగా స్పందించా రన్నారు కార్యక్రమంలో పీఆర్‌టీ యూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నేతలు మధు, రంగారావు, తిరుపతిరెడ్డి, వెంకటేశ్వరరావు, రవి, ప్రసాద్‌  పాల్గొన్నారు

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు