దేశానికే రోల్ మోడ‌ల్.. మ‌రిన్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాలు

6 Oct, 2020 14:34 IST|Sakshi

సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నిక ప్ర‌చారం వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డి స‌తీమ‌ణి సుజాత‌ను ప్ర‌క‌టించారు. దీంతో ఎలాగైనా సీటును కైవ‌సం చేసుకునేందుకు పార్టీ ముఖ్య‌నేత‌లు రంగంలోకి దిగారు. ప్ర‌చారంలో భాగంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. 'తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయి. అదే స్ఫూర్తితో దుబ్బాక నియోజక వర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి చేశారు. పేద‌ల కోసం ఎంత‌గానో కృషి చేశారు. దుబ్బాక ద‌శ-దిశ‌ను మార్చిన గొప్ప వ్య‌క్తి అత‌ను. ఇప్పుడు ఆయ‌న్ని స్ఫూర్తిగా తీసుకుని రామ‌లింగారెడ్డి  సతీమణి మ‌రిన్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.  (దుబ్బాక ఉప ఎన్నికలు: కోవిడ్‌ నిబంధనలు)

రామలింగారెడ్డి భార్య అంటే మాకు చెల్లె లాంటిది. ముఖ్యమంత్రి ఆదేశాల‌నుసారం రామలింగారెడ్డి సతీమణిని కలిసి మాతో పాటు ప్రచారానికి  తీసుకెళ్ల‌డానికి వ‌చ్చాం' అని తెలిపారు.  సోలీపేట సుజాత‌ను భారీ మెజార్టీతో గెలిపించుకొని దుబ్బాక‌ను మ‌రింత అభివృద్ధిప‌థంలోకి తీసుకెళ్దామ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా దుబ్బాక టీఆర్ఎస్ అభ్య‌ర్థి సోలీపేట సుజాత మాట్లాడుతూ..కేసీఆర్ త‌న‌కు క‌న్న‌తండ్రి లాంటివార‌న్నారు. త‌న  భ‌ర్త చ‌నిపోతే కేసీఆర్  ఇంటికి వ‌చ్చి ధైర్యం చెప్పార‌ని పేర్కొన్నారు. పార్టీ టికెట్ కేటాయించినందుకు కెసిఆర్ , మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డికి  ప్ర‌త్యేక ధన్యవాదములు తెలిపారు. రామలింగారెడ్డి ఆశయాలను నెరవేరుస్తాన‌ని హామీ ఇచ్చారు. (దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట సుజాత)

మరిన్ని వార్తలు