తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

6 Aug, 2021 12:39 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సిద్ధిపేటలోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవింతాంతం పాటుపడ్డారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా  తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు.

జయశంకర్ ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో ఆయ‌న చేసిన సూచ‌న‌లు, స‌ల‌హాలు భ‌విష్య‌త్ త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలని పేర్కొన్నారు. యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారని చెప్పారు. జ‌య‌శంకర్‌ జీవితం యువ‌త‌కు ఆద‌ర్శం, స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.

నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
► ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి జగదీష్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. 
►  ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఆచార్య జయశంకర్ సార్ 87వ జయంతి వేడుకలకు ఎంపీలు బండ ప్రకాష్, బీబీ పాటిల్, కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరయ్యారు.
►  హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, సింగరేణి కార్మికసంఘం నేతలు ప్రొ. జయశరంకర్‌ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. 



ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి హరీష్‌ రావు

►  అడిషనల్ డీజీ పర్సనల్ శివధర్ రెడ్డి, వెల్ఫేర్ ఉమేష్ ష్రాఫ్, ఆర్గనైసేషన్ రాజీవ్ రతన్, ఏ.ఐ.జి. రాజేంద్ర ప్రసాద్. ఇతర అధికారులు, సిబ్బంది జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.




►  ఆచార్య కొత్తపల్లిలో జయశంకర్ చిత్ర పటానికి డీజీపీ కార్యాలయంలో పోలీసులు ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు