బ‌హిరంగ ప్ర‌దేశాల్లో వ్య‌ర్థాలు కాల్చివేస్తే క‌ఠిన చ‌ర్య‌లు

2 Sep, 2020 10:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : కోవిడ్‌ బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణలో భాగంగా పకడ్బందీ చర్యలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టి నిలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు దాదాపు రెండు టన్నుల బయో మెడికల్‌ వ్యర్థాలు పోగవుతున్నాయి.  వీటిని రాష్ట్రంలోని 11 కామన్‌ బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్ల ద్వారా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్నారు.  గత మార్చి 19 నుంచి  ఇప్పటివరకు 281.8 టన్నుల వేస్టేజ్‌ను సేకరించి, నిర్వీర్యం చేసినట్లు పీసీబీ అధికారులు వెల్లడించారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ సంద‌ర్భంగా పీసీబీ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

కోవిడ్‌–19 బయో మెడికల్‌ వేస్టేజ్‌ నిర్వహణను పటిష్టంగా అమలు చేయాలని అధికారుల‌కు మంత్రి ప‌లు సూచ‌న‌లు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా, పట్టణీకరణకు అనుగుణంగా కాలుష్య నివారణకు దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలను పీసీబీ సిద్ధం చేస్తోంది.  అన్ని రకాల కాలుష్య సమస్యలనూ అధిగమించేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను కాల్చి వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భారీగా జరిమానాలను విధించే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. (కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి రూ.25 లక్షలు)


 

మరిన్ని వార్తలు