అవినీతి జరిగితే కోర్టుకెళ్లు: కొప్పుల ఈశ్వర్‌

15 Dec, 2020 20:00 IST|Sakshi

బండి సంజయ్‌కు మంత్రి కౌంటర్‌..

సాక్షి, జగిత్యాల: ప్రతి మంచి పనిని విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ లో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం  మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కౌంటర్‌ ఇచ్చారు. అవినీతి ముఖ్యమంత్రి జైలుకు వెళ్లక తప్పదంటున్న బండి సంజయ్.. అవినీతి జరిగితే కోర్టుకు వెళోచ్చని సూచించారు. (చదవండి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు)

అవినీతి లేని రాష్ట్రం ఒక్క తెలంగాణానేనని స్పష్టం చేశారు. చేయచేతకాదు, చేస్తే ఓర్వ లేరని, దుర్మార్గంగా మాట్లాడతారని ఆరోపించారు. వేలాది టీఎంసీల నీరు ప్రతిఏటా వృధాగా పోతుంటే కళ్ళప్పగించి చూశారే తప్ప.. ఎవరు ప్రాజెక్టు నిర్మించలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మిస్తే అవినీతి అంటారని విమర్శించారు. విమర్శించే ముందు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లు, పంప్ హౌస్‌లను చూడాలని మంత్రి హితవు పలికారు. (చదవండి: ఆహా.. అల్లం చాయ్‌.. ఇంకేం కావాలి: కవిత)

మరిన్ని వార్తలు