మంత్రి ‘కొప్పుల’కు మేయర్‌ శస్త్రచికిత్స

20 Jan, 2021 08:36 IST|Sakshi
మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఫైల్‌ ఫోటో

సాక్షి, కరీనంగర్‌/గోదావరిఖని: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ మంగళవారం శస్త్రచికిత్స చేశారు. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈశ్వర్‌ కడుపు ఎడమవైపు పైభాగంలో కణతి ఏర్పడింది. శస్త్రచికిత్స చేసి దానిని తొలగించాలని వైద్యులు ఇదివరకే సూచించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం పర్యటనలో ఈశ్వర్‌ పాల్గొని తిరిగి వస్తుండగా కడుపులో నొప్పి ఎక్కువైంది. మార్గమధ్యంలో గోదావరిఖని మేయర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ను ఆశ్రయించగా విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్‌ చేస్తున్నంత సేపు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆపరేషన్‌ చేసిన అరగంట తర్వాత ఆసుపత్రి నుంచి మంత్రి డిశ్చార్జి అయ్యారు. అనంతరం అధికారిక కార్యక్రమాల్లో ఆయన యథావిధిగా పాల్గొన్నట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.  
 

మరిన్ని వార్తలు