కేటీఆర్ బండి సంజయ్ ట్వీట్ వార్..

3 Oct, 2023 21:18 IST|Sakshi

హైదరాబాద్: నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ పై చేసిన సంచలన వ్యాఖ్యలకు కేటీఆర్ దీటుగా స్పందించారు. ప్రధాని అబద్దాలు చెబుతున్నారని అందుకే బీజేపీని జుమ్లా పార్టీ అంటారని అన్నారు. ఇదిలా ఉండగా కేటీఆర్, బండి సంజయ్ మధ్య ఎక్స్ వేదికగా సీరియస్ వార్ జరుగుతోంది. కేటీఆర్‌ కవిత రూపంలో చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కూడా కవిత రూపంలోనే కౌంటర్ ఇచ్చారు. 

ప్రధాని తెలంగాణ పర్యటనకు ముందు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా కవిత రూపంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులను వివరించారు.  కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, పాలమూరు ప్రాజెక్టు తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు.  

దీనికి బదులుగా బండి సంజయ్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ తెలంగాణాలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఏకరువు పెట్టారు. దొంగ హామీలతో తొమ్మిదేళ్లు కాలయాపన చేశారని వరంగల్‌ డల్లాస్‌ కాలేదని, నిజామాబాద్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలేదని, ఆదిలాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌లు రాలేదని విమర్శలు చేస్తూ కవిత రూపంలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు.    

ప్రధాని Vs కేటీఆర్ 
నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సూటిపోటి వ్యాఖ్యలు చేయడంతో కేటీఆర్ ఘాటుగా స్పందించారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని ఈసారి కూడా బీజేపీకి అదే పరిస్థితి ఎదురవుతుందని తెలంగాణలో వారికీ ఒక్క ఎంపీ సీటు కూడా దక్కదన్నారు. ఎన్డీఏను అని పార్టీలు వీడిపోయాయని, ఈడీ.. సీబీఐ.. మాత్రమే వారితో ఉన్నాయని ఎద్దేవా చేశారు. మేము ఢిల్లీకి గులామ్‌లు కాదు..గుజరాతీలకు బానిసలం కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

ఇది కూడా చదవండి: ‘మోదీ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు’

మరిన్ని వార్తలు