‘డబుల్‌’ ఇళ్ల పంపిణీ: సీఎం ఇంట్లో లిఫ్ట్‌ మాదిరే ఇక్కడ కూడా 

29 Aug, 2021 07:08 IST|Sakshi
లబ్ధిదారు కూతురుచే డబుల్‌ బెడ్రూం ఇంటిని ప్రారంభింపజేస్తున్న మంత్రి కేటీఆర్, చిత్రంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ అసదుద్దీన్‌ 

ఇన్‌–సిటు పద్ధతిలో 9 అంతస్తుల్లో..  

రూ.24.91 కోట్ల వ్యయంతో నిర్మాణం 

గ్రేటర్‌లో లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యం   

నగర సర్వతోముఖాభివృద్ధికి కృషి   

ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ 

పిల్లిగుడిసెలలో 140 మంది లబ్ధిదారులకు ‘డబుల్‌’ ఇళ్ల పంపిణీ

సాక్షి, చంచల్‌గూడ: ఇవి సాధారణ డబుల్‌ బెడ్రూం ఇళ్లు కావు.. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలు అని మంత్రి కేటీఆర్‌ ఉద్ఘాటించారు. శనివారం మలక్‌పేట నియోజకర్గం చావణీ డివిజన్‌లోని పిల్లి గుడిసెల ప్రాంతంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల  ప్రారంభోత్సవం, పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పేదలకు అందిస్తున్న ఒక్కో డబుల్‌ బెడ్రూం ఇల్లు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల విలువ ఉంటుందన్నారు. ఇన్‌– సీటు పద్ధతిలో రూ.24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో ఫ్లాట్లు నిర్మించినట్లు ఆయన తెలిపారు. చదవండి: ప్రత్యక్ష బోధన ఆపండి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు

లబ్ధిదారుల వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇళ్లు ఇచ్చామన్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని మరికొన్ని ప్రాంతాల్లో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామన్నారు. గ్రేటర్‌లో లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రూ.9,700 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మరో 70 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రం మొత్తం రూ.18వేల కోట్ల వ్యయంతో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

చదవండి: ‘దళితబంధు’ సర్వే చకచకా..

అచ్చంగా.. అదే విధంగా..  
సీఎం కేసీఆర్‌ ఇంట్లో ఏ రకమైన లిఫ్ట్‌ను వాడుతున్నారో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇళ్లల్లోనూ ఇదే రకం లిఫ్ట్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్‌ మెయింటెనెన్స్‌కయ్యే ఖర్చులను గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిర్మించిన 16 షాపులను అద్దెకు ఇస్తామన్నారు. రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. ఇతర ప్రభుత్వాలు 70 సంవత్సరాల్లో రాష్ట్రంలో కేవలం రెండు పెద్ద ఆస్పత్రులు నిర్మిస్తే తమ ప్రభుత్వం 4 దవాఖానాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని కేటీఆర్‌ చెప్పారు. గచ్చిబౌలిలో టిమ్స్‌ ఆస్పత్రి నిర్మించామని, ప్రజల అవసరం దృష్ట్యా మరో మూడు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  చదవండి: విద్యుత్‌ సంస్కరణలతో రైతులపై భారం 

కొత్త, పాత నగరమనే తేడా లేకుండా.. 
మూసీనది శుద్ధికి ప్రస్తుతం ఉన్న ఎస్టీపీలకు తోడుగా మరో 335 ఎస్టీపీలను నిర్మిస్తామన్నారు. కొత్త, పాత నగరం అనే తేడా లేకుండా నగర సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్‌ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీల విద్యాభివృద్ధికి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని అదే విధంగా చంచల్‌గూడ జైలును తరలించాలని ఎంపీ అసదుద్దీన్‌ చేస్తున్న విజ్ఞప్తిని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.   అంతకుముందు లాటరీ ద్వారా 140 లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి తాళాలు అందించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు అహ్మద్‌ బలాలా, దానం నాగేందర్, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్, కేటీఆర్‌లకు ఎంపీ కృతజ్ఞతలు 
చావణీలోని చంచల్‌గూడ జైలును ఇతర ప్రాంతానికి తరలించాలని జైలు స్థలంలో ఆస్పత్రులు లేదా విద్యా సంస్థలను నిర్మించాలని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు