కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

17 Jun, 2021 19:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ వల్ల ఎంఎస్‌ఈలు పడుతున్న ఇబ్బందులను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో ఆకర్షణీయమైన అంశాలేమీ లేవని.. ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూర్చే అంశాలు చాలా తక్కువ అని మంత్రి కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

పెద్ద కంపెనీలకే ప్రయోజనాలు చేకూర్చేలా పథకం ఉందన్నారు. కార్పస్‌ ఫండ్‌ స్కీం మార్గదర్శకాలు ఇంతవరకు విడుదల కాలేదని.. లాక్‌డౌన్‌ వల్ల ఎంఎస్‌ఈలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. 25 శాతానికిపైగా ఎంఎస్‌ఎంఈలు రాబడి కోల్పోయాయని.. కేంద్రం ఓ భారీ ఆర్థిక గ్రాంట్‌ ఇస్తే.. ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవచ్చని లేఖలో ఆయన సూచించారు. ప్యాకేజీ విషయంలో ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.

చదవండి: Huzurabad: టార్గెట్‌ ఈటల..పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో?
TS High Court: కమిటీ వేస్తే ఇబ్బంది ఏంటి?

మరిన్ని వార్తలు