LetsTalkVaccination: కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్‌

6 Jun, 2021 20:06 IST|Sakshi

వరల్డ్‌ వ్యాక్సిన్‌ హబ్‌గా ఇండియా

కోవిడ్‌ వ్యాక్సిన్ల కొరత ఎలా వచ్చింది

కేంద్ర వ్యాక్సినేషన్‌ విధానంపై కేటీఆర్‌ పంచ్‌లు

హైదరాబాద్‌ : కేంద్రం అనుసరించిన వ్యాక్సినేషన్‌ విధానంపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. ఆస్క్‌ కేటీఆర్‌ పేరుతో ఆదివారం రాత్రి 7 గంటలకు ట్విట్టర్‌లో ఆయన అందుబాటులోకి వచ్చారు. ఈ సందర్భంగా లెట్స్‌ టాక్‌ వ్యాక్సినేషన్‌ అనే హ్యాష్‌ టాగ్‌తో చర్చను ముందుకు తీసుకెళ్లారు కేటీఆర్‌.

వ్యాక్సిన్‌ హబ్‌గా ఉన్నా
ప్రపంచానికి ఇండియా వ్యాక్సిన్‌ హాబ్‌గా ఉందని, అలాంటి దేశంలో వ్యాక్సిన్ల కొరత రావడమేంటని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌. వ్యాక్సిన్ల డిమాండ్‌కి సరఫరాకి మధ్య గ్యాప్‌ రావడంపై అనేక సందేహాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

ఆలస్యంగా మేల్కొన్నారు
కరోనా కల్లోలాన్ని ఎదుర్కొనేందుకు మిగితా ప్రపంచం అంతా 2020 మే నెలలోనే వ్యాక్సిన్లకు ఆర్డర్లు పెట్టాయని, కానీ కేంద్రం ఆలస్యంగా మేల్కొని 2021 జనవరిలో వ్యాక్సిన్లకు ఆర్డర్లు ఇచ్చిందంటూ కేంద్రానికి మంత్రి  చురకలు అంటించారు. దీనికి సంబంధించి వివిధ దేశాలు వ్యాక్సిన్‌ ఆర్డర్ల ప్రచురితమైన పేపర్‌ క్లిప్‌ని ఆయన జత చేశారు. 

కేంద్రాన్ని అడగండి
నా వ్యాక్సిన్‌ ఎక్కడా అంటూ ఒకరు కేటీఆర్‌ ప్రశ్నించగా .. నన్ను కాదు కేంద్రాన్ని అడగండి అంటూ బదులిచ్చారు కేటీఆర్‌. వ్యాక్సినేషన్‌ ఇలా గందరగోళంగా తయారు కావడానికి కేంద్రమే కారణమన్నారు మంత్రి కేటీఆర్‌. కేంద్రం, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించడం, వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు కేవలం కేంద్రానికి వ్యాక్సిన్లు ఇస్తామనడంపై కూడా ఆయన స్పందించారు. 

మరిన్ని వార్తలు