‘టెక్నాలజీవినియోగంలో తెలంగాణ ముందంజ’

5 Dec, 2022 01:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివిధ రంగాల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని మంత్రి కేటీ రామారావు అన్నారు. నూతన సాంకేతికత ఫలితాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్కాటు చేసిన ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్‌ ప్రస్థానం విజయవంతంగా సాగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ప్రారంభించిన ‘వెబ్‌ 3.0’రెగ్యులేటరీ సాండ్‌ బాక్స్‌ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎమర్జింగ్‌ టెక్నాలజీలో ‘బ్లాక్‌ చెయిన్‌’సాంకేతికత సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ సులభతర జీవనానికి బాటలు వేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సాండ్‌ బాక్స్‌ ద్వారా స్థానిక, అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తుల పనితీరును ప్రత్యక్షంగా పరీక్షించుకునేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘వెబ్‌ 3.0’రెగ్యులేటర్‌ సాండ్‌ బాక్స్‌ను బెంగుళూరులో శుక్రవారం జరిగిన ఎట్‌ ఇండియా హ్యాకథాన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్‌ డైరెక్టర్‌ రమాదేవి లంకా ప్రారంభించారు.  

మరిన్ని వార్తలు