ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

25 Jul, 2021 02:48 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ భవన్‌లో భారీ కేక్‌ కట్‌ చేస్తున్న మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ తదితరులు

తెలంగాణ భవన్‌ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ

అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటిన స్పీకర్, మండలి చైర్మన్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన జన్మదిన వేడుకల్లో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొ న్నారు. టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీని వాస్‌ యాదవ్‌ పాల్గొని 44 కేజీల కేక్‌ కట్‌చేశారు. ‘లీడర్‌’టైటిల్‌తో కేటీఆర్‌పై రూపొందించిన సీడీని హోంమంత్రి మహమూద్‌ అలీ, ప్రత్యేక గీతాన్ని మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి ఆవి ష్కరించారు.  ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దివ్యాం గుడికి త్రిచక్ర స్కూటీ అందజేశారు.

అసెంబ్లీ ఆవరణలో ‘ముక్కోటి వృక్షార్చన
మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ చేపట్టిన ముక్కోటి వృక్షార్చ నలో భాగంగా అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీని వాస్‌రెడ్డి, మండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ వి.భూపా ల్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు. మాసాబ్‌ట్యాంక్‌లోని మహావీర్‌ హాస్పిటల్‌ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో మండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

కేటీఆర్‌ జన్మదినం సందర్భగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నేత లు మొక్కలు నాటడంతో పాటు పలు సామా జిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా,  యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మన్, యూకే డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, ఆస్ట్రేలియా హైకమిషనర్‌ బారీ ఓ ఫారెల్‌ ట్విటర్‌ ద్వారా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మొక్క నాటిన వనజీవి ఖమ్మం రూరల్‌: కేటీఆర్‌ జన్మదినం సంద ర్భంగా శనివారం పద్మశ్రీ వనజీవి రామయ్య ఖమ్మం మండలం రెడ్డిపల్లి గ్రామంలోని తన నివాసంలో మొక్కను నాటారు.

మరిన్ని వార్తలు