నల్లగొండ డీసీసీబీ చైర్మన్‌పై దాడికి యత్నం

19 Sep, 2021 01:22 IST|Sakshi
సమావేశంలో ఆందోళనకు దిగిన కార్యకర్తలు

మహేందర్‌రెడ్డి కారుపై రాళ్లతో దాడి

టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడి ఎన్నికలో ఘర్షణ 

తుర్కపల్లి: టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడికి ఎన్నిక వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా నల్లగొండ డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డిపై పలువురు కార్యకర్తలు దాడికి యత్నించారు. శనివారం యాదా ద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలకేంద్రం లో మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ తుర్కపల్లి మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఆలేరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పడాల శ్రీనివాస్, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, వెంకటాపురం సర్పంచ్‌ కల్లూరి ప్రభాకర్‌రెడ్డి మధ్య పోటీ ఏర్పడింది.

నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నరేందర్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమి స్తూ మహేందర్‌రెడ్డి రాత్రి 7 గంటల సమయం లో ప్రకటన చేశారు. సమావేశం నిర్వహించిన ఫంక్షన్‌హాల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో మహేందర్‌రెడ్డి బయటకు వచ్చారు.  ఆయన తన కారు వద్దకు వెళ్తుండగా కొందరు  కుర్చీలు విసిరారు.

ఈ దాడిలో పలువురికి  గాయాలయ్యాయి. కొందరు రాళ్లు విసరడం తో మహేందర్‌రెడ్డి కారు అద్దాలు పగిలాయి. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దీంతో పడాల శ్రీనివాస్‌కు మద్దతుగా పలువురు నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సమావేశంలో ఆందోళనకు దిగిన కార్యకర్తలు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు