కుమారుడికి అస్వస్థత.. ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం

23 Nov, 2022 09:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీసోదాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష్యతోనే ఈ సోదాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ సోదాల సమయంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి హుటాహుటిన సూరారంలోని ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు. అయితే ఐటీ అధికారులు మల్లారెడ్డిని ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించలేదు.

ఈసందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. నేనేమన్నా దొంగ వ్యాపారాలు చేస్తున్నానా అంటూ ఐటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కొడుకును రాత్రంతా ఇబ్బంది పెట్టారు. నా కొడుకును చూడటానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. నేనేమైనా క్యాసినోలు ఆడిస్తున్నానా అని ప్రశ్నించారు. 200మంది అధికారులను పంపించి దౌర్జన్యం చేస్తున్నారు. బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అంటూ మండిపడ్డారు

చదవండి: (మల్లారెడ్డి కుమారుడికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రికి తరలింపు)

మరిన్ని వార్తలు