నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటి?: నిరంజన్‌రెడ్డి

15 Jul, 2021 19:01 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన నాగర్‌ కర్నూలు జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని, హమాలీ పని రూపంలో ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటని బాధత్యరాహిత్యంగా వ్యాఖ్యానించారు. వరల్డ్ స్కిల్ యూత్ డే రోజు మంత్రి నిరంజన్‌రెడ్డి నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావటం దారుణమని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు