అత్యాధునిక టెక్నాలజీతో విత్తన పరీక్షా కేంద్రం

22 Nov, 2022 03:26 IST|Sakshi
విత్తన పరీక్ష వర్క్‌షాప్‌ను జ్యోతి వెలిగించి  ప్రారంభిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి  

అంతర్జాతీయ విత్తన వర్క్‌షాప్‌ ప్రారంభోత్సవంలో మంత్రి నిరంజన్‌రెడ్డి

ఏజీవర్సిటీ(హైదరాబాద్‌): ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ మారిందని, మన విత్తనాలు దేశంలోని 16 రాష్ట్రాలతోపాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని విత్తన పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయస్థాయి విత్తన పరీక్ష వర్క్‌షాప్‌ను మంత్రి ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ తెలంగాణకే కాకుండా భారత విత్తన పరిశ్రమకు సేవలు అందించడానికి అత్యా«ధునిక టెక్నాల జీతో విత్తన పరీక్షాకేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. విత్తనోత్పత్తిదారులకు, ప్రభుత్వరంగ సంస్థలకు ఇలాంటి అంతర్జాతీయ వర్క్‌షాప్‌ల ద్వారా ఇచ్చే శిక్షణ విత్తనరంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మాట్లాడుతూ ఈ విత్తన పరీక్షాకేంద్రంలో మనదేశంలోని విత్తనోత్పత్తి సంస్థలు, శాస్త్రవేత్తలు, రైతుల తోపాటు ఇతర దేశాల ప్రతినిధులు కూడా ఎంతో నేర్చు కోవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ విత్తన నిపుణుడు ఎడ్డీ గోల్డ్‌శాక్‌(సౌతాఫ్రికా) మాట్లాడుతూ తెలంగాణలో నాణ్య మైన విత్తనోత్పత్తికి మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ విత్తనోత్పత్తి రంగానికి ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని, అందుకే తెలంగాణ అంతర్జాతీయస్థాయి కార్యక్రమానికి వేదిక అయిందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ విత్తన సంస్థ ఎం.డి. కేశవులు మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్‌లో అను భవజ్ఞులైన అంతర్జాతీయస్థాయి విత్తన ప్రముఖులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 25 వరకు జరిగే వర్క్‌షాప్‌లో ఇండియాతోపాటు టాంజానియా, కెన్యా, ఇండోనేíసియా, డెన్మార్క్, దక్షిణ కొరియా, నైజీరియా, ఆస్ట్రే లియా దేశాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

మరిన్ని వార్తలు