డీఎస్సీ–98 అర్హులకు న్యాయం

19 Sep, 2022 01:28 IST|Sakshi

అభ్యర్థులకు మంత్రి హామీ 

సాక్షి, హైదరాబాద్‌: డీఎస్సీ–98 అర్హులందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చినట్టు డీఎస్సీ–98 సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ తెలిపారు. తమ సమస్యలపై ఆదివారం మంత్రిని కలిసి వివరించినట్టు తెలిపారు. అర్హత ఉన్నా దశాబ్దాలుగా తమకు ఉద్యోగాలు రావడం లేదని, ఈ విషయమై సీఎంకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.

సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సాధన సమితి గౌరవాధ్యక్షుడు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లేపల్లి రఘురామరాజు తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు