కేసీఆర్‌ 3 గంటలే నిద్రపోతున్నారు 

27 Mar, 2022 03:10 IST|Sakshi
జెండా ఊపి పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్, చిత్రంలో ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, నరేందర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ తదితరులు   

రాష్ట్ర అభివృద్ధికి అనుక్షణం తాపత్రయపడుతున్నారు 

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి 

హనుమకొండలో మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ ప్రారంభం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

వరంగల్‌ స్పోర్ట్స్‌/వరంగల్‌/ఖిలా వరంగల్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రోజుకు మూడు గంట లు మాత్రమే నిద్రిస్తూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి అనుక్షణం తాపత్రయ పడుతున్నారని మంత్రి శ్రీని వాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో 2 రోజుల పాటు జరగనున్న 8వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ను శనివారం ఆయన ప్రారంభించారు.

అదేవిధంగా ఖిలా వరంగల్‌ మధ్యకోటలో రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న మ్యూజియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.వరంగల్‌ పోచమ్మ మైదాన్‌లో హరిత హోటల్‌ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టూరిజం సర్క్యూట్‌లు ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా ప్రతి జిల్లాలో ఐదు టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 40 ఏళ్లు పైబడిన వెటరన్‌ క్రీడాకారులు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు అథ్లెటిక్స్‌ మీట్‌ నిర్వహణ కార్యదర్శి కూరాకుల భారతి తెలిపారు.  

మరిన్ని వార్తలు