కొందరి వల్లే చెడ్డ పేరు వస్తోంది: శ్రీనివాస్‌ గౌడ్‌

9 Apr, 2022 13:48 IST|Sakshi
మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ వ్యవహారంతో తెలంగాణ పేరు బద్నాం అవుతోందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. అయితే రాష్ట్రంలో మాదక  ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారని, ఇకపై పరిస్థితి మరోలా ఉంటుందని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. 

హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే రాష్టానికి అనేక పెట్టుబడులు వస్తాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం దేశంలోనే నెంబర్‌ వన్‌గా రాష్టాన్ని నిలబెట్టడం. కానీ, కొందరు డబ్బుకు కక్కుర్తి పడి చేసే పనుల వల్ల చెడ్డ పేరు రాష్ట్రానికి వస్తోంది. ఈ తరుణంలో డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గతంలో పేకాట, గుడుంబాను అరికట్టగలిగాం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్లెవరినీ వదిలిపెట్టం. అలాగే వ్యాపారాలు చేసుకోవాలనుకునేవాళ్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.

మరిన్ని వార్తలు