కొత్తగా నిర్మించే ఇళ్లకు నిబంధనలు తప్పనిసరి 

7 Sep, 2020 10:22 IST|Sakshi

సాక్షి, పాలమూరు: పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన జంక్షన్‌ వెడల్పు, రోడ్డు విస్తరణ పనులకు అందరూ సహకరించాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న జంక్షన్‌ అభివృద్ధి పనులను ఆదివారం రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త కాలనీల్లో నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రోడ్లు అక్రమించుకోవద్దన్నారు. గతంలో గ్రామాలను మున్సిపాలిటీల్లో వీలినం చేసిన సందర్భాల్లో పంచాయతీలుగానే కొనసాగించాలనే డిమాండ్‌ ప్రజల నుంచే వచ్చేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చూసి అందరూ మున్సిపాలిటీల్లో కొనసాగాలనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్‌ గణేష్, కలెక్టర్‌ వెంకట్‌రావ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు