గ్రేట్‌ లవర్స్‌.. ఫేస్‌బుక్‌ లవ్‌ మ్యారేజ్‌ చివరకు ఇలా..

18 Aug, 2022 09:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్షణ కాలం ఆవేశం వారి ప్రాణాలను బలిగింది. సికింద్రాబాద్‌లో మైనర్‌ ఫేస్‌బుక్‌ ప్రేమ జంట వివాహం విషాదంతో ముగిసింది. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

వివరాల ప్రకారం.. శ్రీకాంత్‌కు ఫేస్‌బుక్‌లో ఓ యువతికి మధ్య పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జూన్‌ 4వ తేదీన ఇంట్లో నుంచి పారిపోయి పెద్దలకు తెలియకుండా పెళ్లిచేసుకున్నారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న మైనర్‌ జంటకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

కాగా, యువతిని వారి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లడంతో శ్రీకాంత్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉన్న శ్రీకాంత్‌ మనోవేదన చెందాడు. ఈ క్రమంలో తన ప్రేయసి ఆగస్టు 15న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి షాక్‌కు గురయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయి ఇక లేదన్న విషయాన్ని తట్టుకోలేని శ్రీకాంత్‌.. అమ్ముగూడ రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మరణాలతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. 

ఇది కూడా చదవండి: సంచలనంగా మారిన తమ్మినేని మర్డర్‌ కేసు..

మరిన్ని వార్తలు