హైదరాబాద్‌ మింట్‌లో ఉద్యోగాలు.. నెలకు 95 వేలకు వరకు జీతం

1 Dec, 2021 16:01 IST|Sakshi

ప్రభుత్వరంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎస్‌పీఎంసీఐఎల్‌)కు చెందిన భారత ప్రభుత్వ మింట్, హైదరాబాద్‌.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 15

► పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఎంగ్రేవర్‌.

► సూపర్‌వైజర్‌: డిప్లొమా/బ్యాచిలర్‌ డిగ్రీ(బీఈ/బీటెక్‌) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–30 ఏళ్లు ఉండాలి. వేతనం నెలకు రూ. 27,600 నుంచి రూ.95,910 చెల్లిస్తారు.

► ల్యాబొరేటరీ అసిస్టెంట్‌: బ్యాచిలర్‌ డిగ్రీ(బీఎస్సీ) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–28 ఏళ్లు ఉండాలి. వేతనం నెలకు రూ.21,540 నుంచి రూ.77,160 వరకు చెల్లిస్తారు.

► ఎంగ్రేవర్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(స్ల్కప్చర్, పెయింటింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–28 ఏళ్లు ఉండాలి. వేతనం నెలకు రూ.23,910 నుంచి రూ.85,570 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మింట్‌ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021

మరిన్ని వార్తలు