Telangana: ఆకాశంలో అద్భుతం

14 Jun, 2022 07:44 IST|Sakshi

ఖానాపూర్‌: ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సోమవారం ఉదయం కొన్ని గంటలపాటు సూర్యుడి చుట్టు ఇంద్రధనుస్సు తరహాలో వలయాన్ని ఏర్పడింది. జిల్లా ప్రజలు పలువురు వీక్షించారు. కొందరు కళ్లద్దాల్లో, మరికొందరు సెల్‌ఫోన్లలో సూర్యుడి ఫొటో, వీడియోల్లో చిత్రీకరించారు.

అవి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యాయి. వాతావరణంలో నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడంతో ఈ తరహా వలయాలు ఏర్పడుతాయని మస్కాపూర్‌ ప్రభుత్వ పాఠశాల సైన్స్‌ టీచర్‌ జాడి శ్రీనివాస్‌ తెలిపారు. దీన్ని కెలడోస్కోప్‌ ఎఫెక్ట్‌ అంటారని పేర్కొన్నారు.  

చదవండి: (టీఎస్‌ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్‌ఆర్టీసీకి రాబడి)

మరిన్ని వార్తలు