38 సార్లు మందు కొట్టినా.. చేతికి అందలేదు 

4 Jan, 2022 08:54 IST|Sakshi
నారాయణ

సాక్షి, కోదాడ(నల్లగొండ): గతేడాది మిర్చికి మార్కెట్‌లో మంచి రేటు ఉండటంతో ఈ ఏడాది రైతులు ఎంతో ఆశతో మిరప సాగు చేపట్టారు. కానీ, తెగుళ్ల తీవ్రతతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. విపరీతమైన తెగుళ్లతో పంట ఎదుగుదల లేక, పూత రాక.. వచ్చినా కాత నిలవకుండా పోయింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రెడ్లకుంటకు చెందిన అంబటి నారాయణ రెండు ఎకరాల్లో మిరప సాగు చేపట్టారు.

సాగు చేసిన తర్వాత పంటకు విపరీతంగా తెగుళ్లు సోకడంతో పురుగు మందులతో పాటు సేంద్రియ ద్రావణాలను కూడా దాదాపు 38 సార్లు స్ప్రే చేశాడు. రెండు ఎకరాల సాగు కోసం రూ.లక్షా 25 వేల పెట్టుబడి పెట్టాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. క్వింటా మిరప కూడా దిగుబడి రాలేదు. చేసేదేం లేక గత వారం రోజులుగా పంటపొలంలో గేదెలు మేపుతున్నానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 

మరిన్ని వార్తలు