పోలీసులైతే నాకేం భయం!

24 Mar, 2021 10:48 IST|Sakshi
బాలుడితో ముచ్చటిస్తున్న సీఐ రమేష్‌

సాక్షి, కుత్బుల్లాపూర్‌: ‘‘అమ్మా... నేను.. అక్క.. ముగ్గురం ఆటోలో వచ్చాం.. వాళ్లు కనిపించడం లేదు’’ అంటూ వచ్చీరాని మాటలతో తప్పిపోయిన ఓ బాలుడు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో సందడి చేశాడు. తాత పేరు గోవర్ధన్‌ రావు అని, ఎల్‌కేజీ చదువుతున్నానని సీఐ రమేష్‌తో మాట కలిపాడు. చివరకు తప్పిపోయిన బాలుడి ఆచూకీ కోసం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన బాలుడి తాతయ్య అతడిని చూసి అవాక్కయ్యాడు. కుత్బుల్లాపూర్‌ కొంపల్లి బ్యాంక్‌ కాలనీలో గోవర్ధన్‌ రావు తన మనవడితో కలిసి ఉంటున్నాడు.

ఉదయం ఆరు బయట ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు కేవీఆర్‌ గార్డెన్‌ ముందు ఏడుస్తూ కనిపించాడు. స్థానికులు డయల్‌ 100 కి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ బాలుడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎటువంటి భయం లేకుండానే సీఐ రమేష్‌తో వచ్చీరాని మాటలతో ఆ బాలుడు మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. చివరికి తాతయ్య రావడంతో అతనికి అప్పగించారు.

చదవండి: కోరిక తీర్చు.. లేదంటే నీ భర్త, కొడుకు..

మరిన్ని వార్తలు